మంత్రి పరిటాలకు చేదు అనుభవం

Update: 2017-11-28 14:19 GMT

ఏపీ మంత్రి పరిటాల సునీత గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కనుక్కోలేకపోయారు. ఈరోజు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత గుంటూరు టీడీపీ కార్యాలయానికి వెళ్లాలనుకున్నారు. కాని పోలీసులు మాత్రం మంత్రిని టీడీపీ ఆఫీసుకు చేర్చేలేకపోయారు. స్థానిక పోలీసులు ఎవరూ వెంట లేకపోవడంతో గుంటూరులో టీడీపీ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక మంత్రి సెక్యూరిటీ ఇబ్బంది పడ్డారు. మంత్రిని జిల్లా పోలీసులపై మంత్రి ఫైరయ్యారు. అరగంటకు పైగా తిరిగినా మంత్రికి టీడీపీ కార్యాలయం కన్పించలేదట.

Similar News