Donald Trump : ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాడుగా?
ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది
అగ్రరాజ్యం కాదది.. విఫల రాజ్యంగా మారింది. ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి నియంత ఆలోచనలు ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇరాన్ వంటి చిన్న దేశంతో ఆరు వారాల నుంచి అమెరికా, ఇజ్రాయిల్ లు కలసి యుద్ధం చేస్తుంది. అయినా ఇరాన్ ను అమెరికా దారికి తెచ్చుకోలేకపోతుంది. దాడులకు ప్రతిదాడులను నిర్వహిస్తుంది. అమెరికా ఆర్థిక మూలాలపై ఇరాన్ దెబ్బతీస్తుండటంతో అగ్రరాజ్యం అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచం ముందు బలహీనమైన దేశంగా ట్రంప్ ముద్రను తానే వేసినట్లయింది. ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుని తప్పుచేశామా? అని ఆ దేశప్రజలు కూడా ఆలోచిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
అనాలోచిత చర్యలతో...
ట్రంప్ తీసుకునే అనాలోచిత చర్యలు ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అమెరికా మిత్ర దేశాలు కూడా ట్రంప్ వైఖరిని సమర్థించడం లేదు. వెనిజుల్లా అధినేతను తమ అధీనంలోకి తీసుకున్నంత సులువుగా ఇరాన్ ను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని ఈ పిచ్చి చేష్టల ట్రంప్ భావించాడు. కానీ డామిట్.. కథ అడ్డం తిరిగినట్లు.. ట్రంప్ పాలనపై సొంత దేశంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డాలర్ కూడా బలహీనపడింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ సంక్షోభం యూరోపియన్ దేశాలు ఎదుర్కొంటున్నాయి.
ఇరాన్ పై పెత్తనం చేయడానికే...
ట్రంప్ చర్యలను సమర్థించేవారి కంటే వ్యతిరేకించే వారే అంతర్జాతీయ సమాజంలో ఎక్కువయ్యారు. ఇరాన్ పై తాను పెత్తనం చేయాలని భావించడమే ట్రంప్ చేసిన మొదటి తప్పిదం. అది భయంతో వారిని తమ దాడికి తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ అది వికటించింది. హోర్ముజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఇరాన్ పట్టించుకోవడం మానేసింది. దీంతో ట్రంప్ గడువు పొడిగిస్తూ వెళుతున్నారు. ఈ ట్రంప్ మెంటల్ చేష్టలతో అన్ని దేశాల్లో ధరలు పెరిగాయి. కేవలం చమురు ధరలు మాత్రమే కాదు.. అన్ని దేశాల్లో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ట్రంప్ అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడిని ఎదుర్కొనక ముందే తలవొంచి ఏదో ఒక రాజీ చేసుకుని యుద్ధాన్ని ముగించకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.