IPL 2026 : రాయల్ ఛాలెంజర్స్ పై సూపర్ కింగ్స్ ఓటమి

ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరసగా రెండో గెలుపును సాధించింది

Update: 2026-04-06 02:14 GMT

ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరసగా రెండో గెలుపును సాధించింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 43 పరుగుల తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. సీఎస్కే మరొకసారి నిరాశమిగిలింది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే పై చేయిగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగులు చేసింది.

ధీటుగా ఆడటంతో...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు టిమ్‌ డేవిడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఆకాశమే హద్దుగా విరుచుకుపడగా, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో ఆదివారం బెంగళూరులో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ 43 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేసింది. పడిక్కల్‌ 29 బంతుల్లో 50, డేవిడ్‌ 25 బంతుల్లో 70 పరుగులు చేశారు. పాటిదార్‌ కేవలం 19 బంతుల్లో అజేయంగా 48 పరుగులు జత చేశాడు. ముగ్గురి దాడితో సీఎస్‌కే బౌలర్లు పూర్తిగా తడబడ్డారు. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమి చవిచూసింది.
తొలిదశలోనే దెబ్బ...
30 పరుగులకే సాంజూ శాంసన్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, ఆయుష్‌ మాత్రే అవుట్ కావడంతో సీఎస్‌కే చేజ్‌ మొదలులోనే దెబ్బతింది. జేకబ్‌ డఫీ ఈ దశలో కీలకంగా బౌలింగ్‌ చేశాడు. శాంసన్‌, గైక్వాడ్‌లను పడిక్కల్‌కు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చేలా చేశాడు. మాత్రే వికెట్‌తో భువనేశ్వర్‌ కుమార్‌ ఐపీఎల్‌లో 200 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ప్రతిఘటించినా లక్ష్యం చాలా దూరంగా ఉంది. క్రుణాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కీలక వికెట్లు తీశారు. ఓవర్టన్‌, ప్రశాంత్‌ వీర్‌ మధ్య 57 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా భువనేశ్వర్‌ చెరిపేశాడు. లక్ష్యఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరసగా రెండో విజయంకాగా, చెన్నై సూపర్ కింగ్స్ కు వరస అపజయం దక్కినట్లయింది.


Tags:    

Similar News