Tirumala : నేడు కూడా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుం

Update: 2026-04-06 03:27 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శుక్రవారం మొదలయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సోమవారం సహజంగానే భక్తుల రద్దీ కొనసాగుతుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల దర్శనానికి గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

గదుల కొరత...

వేసవి కాలంలో గదులు దొరకడం కూడా భక్తులకు కష్టంగ మారింది. అయితే టీటీడీ ఇటీవల అధునాతనంగా నిర్మించిన డార్మెంటరీలో వేలాది మంది భక్తులు సేద తీరుతున్నారు. ఇక్కడ లాకర్ సౌకర్యం ఉండటంతో పాటు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు కూడా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీంతో గదులు దొరకని వారు ఇక్కడకు వచ్చి లాకర్లలో తమ సామాన్లు ఉంచి స్వామి వారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై కంపార్ట్ మెంట్లలో..
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,271 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,018 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News