Ongole : ఒంగోలు పాలిటిక్స్ లోకి ఈదర రీ ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఒంగోలు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ప్రకటించారు

Update: 2026-04-06 07:02 GMT

ఒంగోలు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ప్రకటించారు. తనకు ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినప్పటికీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కినట్లయింది. సేవ్ ఒంగోలు పేరుతో తాను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నానని ఈదర హరిబాబు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని, ఏ పార్టీ వచ్చినా పట్టణం అభివృద్ధి కాలేదని, ప్రజల మౌలిక సదుపాయాలు కూడా పెద్దగా ఏర్పాటు కాలేదని ఈదర హరిబాబు అన్నారు.

1994లో ఎమ్మెల్యేగా...
ఈదర హరిబాబు తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 1994లో తొలిసారి ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా దూరమయ్యారు. ఈదర హరిబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో మంచి పేరుంది. అయితే ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈదర హరిబాబు పోటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ రాజకీయ పార్టీల్లో మొదలయింది. అయితే హరిబాబు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
కార్యకర్తలతో సంబంధాలు...
ఈదర హరిబాబుకు ఇప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలతో మంచి సంబంధాలున్నాయి. కమ్మ సామాజికవర్గంలో పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ కళాపరిషత్ పేరిట ఈదర హరిబాబు నాటిక పోటీలను నిర్వహిస్తుంటారు. జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తూ కళను నిలబెడుతున్నారన్న పేరుంది. ఎన్టీఆర్ కళాపరిషత్ ఛైర్మన్ గా ఈదర హరిబాబు వ్యవహరిస్తున్నారు. అయితే హరిబాబు తాను కానీ తన కుమారుడు కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించడంతో ప్రధానంగా టీడీపీ వర్గాల్లో ఒకింత ఆందోళన కనపడుతుంది. ఈదర హరిబాబు కు పడే ప్రతి ఓటు టీడీపీ నుంచి వెళుతుందన్న అనుమానం ఉంది. అయితే ఎన్నికలకు సమయం ఉండటంతో టీడీపీ నాయకత్వం ఆయనను బుజ్జగిస్తుందని కూడా అంటున్నారు.


Tags:    

Similar News