భర్త వేధింపులు తాళలేక...!

Update: 2017-12-01 12:57 GMT

తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన కి దిగింది. ఉప్పల్ కి చెందిన అమూల్య (29) ప్రగతి నగర్ కు చెందిన రాజాచంద్ర ను వివాహం చేసుకున్నారు. రాజాచంద్ర డెలాయిట్ లో ఉద్యోగి. 2015.నవంబర్ లో కట్నకానుకలతో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళకీ... ఉతికిన బట్టలు మళ్ళీ ఉతకాలని అత్త ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందులు పెడుతూ మరో పక్క.భర్త..కళ్ళ అద్దాలు ఉన్నాయని..లావుగా ఉన్నావని.. తెల్ల వెంట్రుకలు వచ్చాయని.. ఇలా వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులు చేస్తున్నారు. దీంతో అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ను ఆశ్రయించారు.ప్రస్తుతం తనకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సహకారంతో భర్త ఇంటి ముందు ధర్నా కి దిగారు. ఇట్టి విషయం పోలీసుల దృష్టికి రాగా, ఇరు పక్షాల వారిని స్టేషన్ కి పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం లేకపోవడంతో రాజాచంద్ర పై కూకట్ పల్లి లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు కోర్టులో ఉండగా న్యాయం కోసం ఆందోళనకు దిగడం తగదని పోలీసులు నచ్చ జెబుతున్నా ఆమె వినడం లేదు. ఆమెదీక్షను కొనసాగిస్తుంది.

Similar News