భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలకొండ

Update: 2017-01-07 04:40 GMT

కలియుగ వైకుంఠవాసుడి దర్శనానానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారిని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. వీఐపీల తాకిడీ రేపు ఎక్కువగానే ఉంటుంది. వైకుంఠ ద్వాదశి రోజున ప్రత్యేకంగా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించే భాగ్యం దక్కుతుండటంతో తిరుమల కొండకు నేటి నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది.

శనివారం ఉదయం నుంచే రేపటి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. దాదాపు 24 గంటల పాటు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాలి. వీరికి భోజనం, మంచినీటి సదుపాయాన్ని టీటీడీ ఉచితంగా కల్పిస్తోంది. రవీఐపీల కోసం పద్మావతి మరికొన్ని అతిథి గృహాలను టీటీడీ బ్లాక్ చేసేసింది. 3 రోజుల పాటు నడకదారి భక్తులకు టోకెన్లను నిలిపేశారు. రేపు తెల్లవారు జామున 3గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సభలు కూడా జరుగుతండటంతో వీఐపీల తాకిడీ ఎక్కువగానే ఉండొచ్చు.

Similar News