ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టులోనేప్రధాని బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం నాలుగువేల మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ స్వాగత సభలో పాల్గొన్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో మియాపూర్ కువెళ్లి మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వత ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొంటారు.