ఫోర్త్ ఎస్టేట్‌పై కొ రడా : సహేతుక నిషేధం!

Update: 2016-11-03 23:44 GMT

ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. కేంద్రప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞల కారణంగా ఎన్డీటీవీ ప్రసారాలు 24 గంటలపాటూ నిలిచిపోనున్నాయి. 9,10 తేదీల్లో ఈ ప్రసారాల నిలిపివేత ఉంటుంది. వార్తలు ప్రసారం చేసేటప్పుడు నిబంధనలను పాటించకపోయిన తప్పిదానికి ఎన్డీటీవీ ఈ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పై దాడి జరిగినప్పుడు , ఎయిర్ బేస్ లోని కీలక ప్రదేశాలు కూడా ఎన్డీటీవీలో ప్రసారం అయిపోయాయి. అనుమతి లేని కొన్ని నిషిద్ధ ప్రాంతాలను ప్రసారం చేయడం వలన భద్రత పరంగా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో.. ఎన్డీటీవీ మీద కేంద్ర సమాచార ప్రసార శాఖ కొరడా ఝుళిపించింది. 24 గంటల పాటూ ప్రసారాల నిషేధానికి ఆదేశించింది. ఆ మేరకు 9, 10 తేదీల మధ్యలో ఈ నిషేధాన్ని ఎన్డీటీవీ అమలు చేయనుంది.

ఫోర్త్ ఎస్టేట్ గా వ్యవహరించే మీడియా మీద ప్రభుత్వాలు కన్నెర్ర చేయడం అరుదుగా జరిగే సంగతి. అయితే సాధారణంగా వారిపట్ల ఉపేక్ష ధోరణి చూపిస్తుంటారు గనుకనే.. ఆయా మీడియా సంస్థలు కూడా.. అడ్డగోలుగా చెలరేగిపోతుంటాయి. తెలియక హద్దులు దాటుతుండే వారు కొందరైతే, తెలిసీ తమను ఏం చేస్తార్లే అనే ధీమాతో విచ్చలవిడిగా వ్యవహరించే వారు కొందరు. ఇప్పుడు ఎన్డీటీవీ లాంటి అగ్రశ్రేణి టీవీ ఛానెల్ మీద వేటు వేయడం అనేది.. అందరిలోనూ మార్పు రావడానికి కారణం కాగలుగుతుంది.

Similar News