Gold Rates Today : హిస్టరీని షేక్ చేస్తున్న గోల్డ్ రేట్స్.. కొనటానికి ఆస్తులు సరిపోవేమో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.

Update: 2025-12-24 03:28 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు కొత్త ఏడాది ప్రారంభానికి ముందే నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ఈ ఏడాది మాత్రం బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. అదే సమయంలో తగ్గుతాయన్న ఆశలు కూడా రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరుగుతుండటం ఒకరకంగా ఆందోళనకు దారి తీస్తుంది. మరొకవైపు కొనుగోళ్లు భారీగా తగ్గడమే కాకుండా జ్యుయలరీ దుకాణాల నిర్వహణ కూడా కష్టంగా మారింది. అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

కారణాలివే...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ మరింత బలపడటం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా అధ్యక్షుడు విధించిన అదనపు సుంకాలు, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. దీంతో పాటు విదేశాల నుంచి బంగారం దిగుమతులు కూడా భారీగా తగ్గడం ధరలు పెరగడానికి కారణాలంటున్నారు. ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గడమనేది జరగదని, తగ్గినా స్వల్పంగానే తగ్గుతాయని, భారీ పతనం మాత్రం కాదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలిలా...
బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఇటీవల కొద్దిగా పెరిగారు. వరసగా ధరలు పెరుగుతుండటంతో లాభాలు స్వల్ప కాలంలో వచ్చి పడతాయని భావించి కొందరు పెట్టుబడికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 2,200 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై3,100 రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలిలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,560 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి దర 2,34,100 రూపాయలుగా నమోదయింది.









Tags:    

Similar News