Andhra Pradesh : కొత్త కేబినెట్ కు కసరత్తు పూర్తి...వాళ్లిద్దరికీ ఊస్టింగ్ ఖాయం.. అదే వారికి మైనస్ పాయింట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు.

Update: 2025-12-24 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. భారీగా మార్పులు చేసే అవకాశం ఉందని తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండటంతో ఇక ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ వీలయినంత త్వరగా చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే జిల్లాల వారీగా కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. గతంలో ఉన్న వారిని కాదని తొలి మంత్రి వర్గంలో చాలా మందికి కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే మంత్రివర్గంలోని చాలా మందిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. మరో మూడేళ్లలో ఎన్నికల సమయం ఉండటంతో బలమైన కేబినెట్ టీం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కసరత్తు పూర్తయినట్లేనా?
అందులో భాగంగానే మంత్రి వర్గ విస్తరణకు ఆయన సిద్దమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మూఢమి నడుస్తుండటంతో మరో రెండు నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీనేతలు కూడా చెబుతున్నారు. ఈ కేబినెట్ లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. వారిలో నెల్లూరుకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్ధసారధి ఉన్నారు. వీరిద్దరినీ తప్పిస్తారని మాత్రం పెద్దయెత్తున టాక్ అమరావతిలో వినిపిస్తుంది. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారంటున్నారు. అలాగే కృష్ణా జిల్లా నుంచి పార్ధసారధిని తప్పిస్తే మరకొరికి అప్పగిస్తారని కూడా అంటున్నారు. అయితే యాదవ సామాజికవర్గం నుంచి ఇప్పటికే బీజేపీకి చెందిన సత్యకుమార్ ఉండటంతో మరొక సామాజికవర్గానికి ఇస్తారని అంటున్నారు.
వీరిని పక్కనపెట్టి...
ఇక రాయలసీమలోనూ సవితను కూడా పక్కనపెట్టాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఇక ఉత్తరాంధ్రలో గుమ్మడి సంధ్యారాణిని కూడా తప్పిస్తారని బలంగా ప్రచారం జరుగుతుంది. వీరి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. మరొకవైపు చంద్రబాబు కేబినెట్ లో ఒక మంత్రిపోస్టు ఖాళీగా గత రెండేళ్ల నుంచి ఉంది. దానిని కూడా భర్తీ చేసి సామాజికవర్గాలతో పాటు సీనియర్లకు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే వచ్చే ఏడాది ఉగాదికి కొత్త కేబినెట్ కొలువు దీరే అవకాశముందని, దాదాపు పది నుంచి పదిహేను మందిని మార్చాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.


Tags:    

Similar News