నేను తెలంగాణ చిన్నమ్మను

Update: 2017-11-28 14:18 GMT

‘నన్ను తెలంగాణలో చిన్నమ్మ అని పిలుస్తారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు బాగా తెలుసు. తనను అందరూ తెలంగాణలో చిన్నమ్మ అని పిలుస్తారు ’ అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో సుష్మా ప్రసంగించారు. హైదరాబాద్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్రంగా మారిందన్న సుష్మా… ఈ సదస్సు కూడా అనేక సంప్రదాయాలు, ఆధునికతల సమ్మేళనంగా అభివర్ణించారు. భారత్ ఎన్నో అవకాశాలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు. భారత ప్రధాని మోడీ, అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఇండియా-అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News