టెస్టుల్లో విరాట్ కొహ్లి రెండో డబుల్ సెంచరీ

Update: 2016-10-09 08:33 GMT

ఇండోర్‌లో జరుగుతున్న భారత జైత్రయాత్ర విరాట్ కొహ్లి విశ్వరూపంతో మరింత ఘనంగా తయారవుతోంది. రెండో రోజు ఆటలో విరాట్ కొహ్లి అజేయమైన డబుల్ సెంచరీ ని నమోదు చేశాడు. ఒకవైపు రహానే సెంచరీ పూర్తి చేసిన కొద్దిసేపటికి.. విరాట్ తన డబుల్ సెంచరీ ని పూర్తి చేసి.. న్యూజిలాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా నిలిచాడు. 347 బంతుల్లో 18 ఫోర్లతో కొహ్లి ఈ అరుదైన రికార్డును సాధించడం విశేషం.

రెండో రోజు ఆటలో కొహ్లి, రహానే ల జోడీ అంటే కివీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. వీరిని విడదీయడం కాదు కదా.. ఏ దశలోనూ వీరి దూకుడును అడ్డుకోవడం వారికి సాధ్యం కాలేదు. లైన్ అండ్ లెంగ్త్ కరెక్ట్ గా వచ్చిన బంతులను జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూ లూజ్ బాల్ పడినప్పుడు భారీ షాట్లు కొట్టడానికి వెనకాడకుండా.. వీరిద్దరూ కివీస్ బౌలర్లను ఓ చూపు చూశారు. ఈ అయిదు రోజుల మ్యాచ్ ను వీక్షించడానికి ఇండోర్ స్టేడియంకు వచ్చిన 22 వేల మంది ప్రేక్షకులకు కనుల పండుగ అయిందంటే అతి శయోక్తి కాదు.

రహానే కూడా 160 పరుగులతో డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రహానే డబుల్ పూర్తయినా కూడా ఆశ్చర్యం లేదు.

Similar News