ఉద్యమ నేత జిగ్నేశ్ మెవాని గెలిచారు. దళిత ఉద్యమ నేతగా ఉన్న జిగ్నేశ్ మెవానీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వడ్గాం రిజర్వ్ డ్ స్థానం నుంచి ఈయన బరిలోకి దిగారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరినీ నిలబెట్టలేదు. దీంతో గతంలో వడ్గాంలో ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా చివరకు జిగ్నేశ్ మెవానీనే విజయం వరించింది.