విపక్ష నేత జగన్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు ఏమీ కాలేదు. తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ఆయన క్షేమంగా ఉన్నారు.
జగన్ కర్నూలులో యువభేరి కార్యక్రమంలో ప్రత్యేకహోదా గురించి జనంలో చైతన్యం తీసుకురావడానికి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. సభానంతరం ఆయన హైదరాబాదుకు వస్తుండగా.. జగన్ ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయింది.. హైదరాబాదు సమీపం పాలమాకుల వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి.. రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. డ్రైవరు చాలా అప్రమత్తంగా ఉండి బ్రేకులు వేయడంతో ఆగిపోయింది.
కారు టైరు మార్చే వరకు జగన్ అక్కడే నిరీక్షించి తిరిగి అదే కారులోనే హైదరాబాదుకు చేరుకున్నారు. అప్పటిదాకా ఆయన కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వాహనాలన్నీ అక్కడే ఆగిపోయాయి.