తెలంగాణ సర్కారు కూడా కార్పొరేట్ శక్తులు చేతుల్లో కీలుబొమ్మలా పాలన సాగిస్తున్నదా?రాజకీయ వ్యవస్థపై కార్పొరేట్ లు స్వారీ చేయడం అనేది కొత్త కాదు. కానీ.. తెలంగాణ సర్కారు కూడా ఆ చట్రంలోనే ఉన్నట్టు.. ఆ పార్టీ నేతలే భావిస్తుంటే గనుక.. ఆలోచించాల్సిన విషయమే. తెరాస ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడమూ... పైగా ఎన్నికల సంస్కరణలు తక్షణ అవసరం అంటూ మోదీ ఆ పనిచేయాలంటూ విన్నవించడమూ చూస్తోంటే అలాంటి అభిప్రాయం కలుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రా దోపిడి దారులనుండి విముక్తి కలుగుతుందని ఊదరకొట్టి, మన రాష్ట్రాన్ని మనమే స్వేచ్చగా పాలించుకుంటామని ఇలా ఎన్నో ఆశలు తెలంగాణ ప్రజలకి కల్పించిన కేసిర్ ఇప్పుడు ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చాలా మందికి కుంటంబపాలన నచ్చకపోయిన కిమ్మనకుండా వున్నారు, వేరే గత్యంత్రము లేక. కానీ ఒంటెద్దు పోకడ నిర్ణయాలు చాలామంది కి ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నది నిజమని చాలామంది నాయకులు అనుకుంటున్నారు. ఫార్మ్ హౌస్ నుండి పాలనతో బంగారు తెలంగాణ వస్తుందా అన్నది అనుమానమే అని అనుకుంటున్నారు.
ప్రజల సమస్యల కన్నా అవినీతి, రాజకీయ లబ్ది పెరుగుతున్నాయని కోదండరాం వంటి నాయకులు బహిరంగగానే తెలంగాణ సర్కారును విమర్శిస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే ప్రధాని మోదీ మొదట ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచిస్తున్నట్టుగా వుంది.