ఏడు కొండలు ఖాళీగా కన్పిస్తున్నాయి. సాధారణంగా నూతన సంవత్సరం తొలిరోజున శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని భావించిన టీటీడీ అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఘాట్ రోడ్ ను కూడా తెల్లవార్లూ తెరిచే ఉంచారు. అయితే భక్తుల రద్దీ పెద్దగా లేదు. వీఐపీల సందడి కూడా లేకపోవడంతో స్వామి వారి దర్శనం మూడు గంటల్లోనే లభిస్తుంది. నగదు కొరత గోవిందుడి మీద కూడా పడింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ నెల 8వ తేదీన ఉండటంతో అప్పుడు కొండకు వద్దామని భక్తులు భావించి ఉంటారని టీటీడీ అభిప్రాయపడుతుంది.