ఇటీవలి వర్షాల దెబ్బకు జనం ఇప్పుడిప్పుడే తిరిగా సాధారణ పరిస్థితికి చేరుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులపాటూ తీవ్రస్థాయిలో అతలాకుతలం అయిన జనజీవనం మళ్లీ గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉరుములతో కూడిన కొద్ది పాటి వర్షాలు వస్తుండడం... ప్రజల్ని భయపెడుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం, ఉపరితల ఆవర్తనం వంటి వాతావరణ వార్తలు జనంలో భయాన్ని పెంచుతున్నాయి.
సాధారణంగా వర్షాలు తెరపిచ్చిన తర్వాత.. ఒకవైపు తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంతో పాటూ, మళ్లీ ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల విధి. హైదరాబాదు నగరం విషయాన్నే తీసుకుంటే.. నాలాల మీద భారీగా ఆక్రమణల్ని కూల్చడం, కొన్ని రోడ్లను బాగు చేయడం తప్ప.. నాలాలను వెడల్పు చేయడం వంటి అవసరమైన పనులు జరిగినట్లుగా ఎక్కడా వార్తలు రాలేదు.
మరి ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న జల్లులు.. చిరు జల్లులుగానే వెళ్లిపోవాలని, భారీ వర్షాలుగా మారకూడదని జనం దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.