లోక్ సభలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. లోక్ సభ ఉదయం 11గంటలకు ప్రారంభమై సభ్యుల ఆందోళనతో వాయిదా పడింది. తిరిగి 12గంటలకు ప్రారంభమైన తర్వాత టీడీపీ, వైసీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి వెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అమలును రాష్ట్రాలకు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు. గొరఖ్ పూర్ లోక్ సభ ఎన్నికల ఫలితం ప్రకటించకపోవడంపై వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చారు. గందరగోళం నడుమే లోక్ సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.