Bus Accident : తెల్లారకముందే తెల్లారిపోయిన బతుకులు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. బస్సు మంటల్లో దగ్దం కావడంతో పదమూడు మంది సజీవ దహనమయ్యారు. ఇరవై ఆరు మంది గాయపడ్డారు. అయితే టిప్పర్ డ్రైవర్ దొరికితే కాని ప్రమాదానికి గల కారణాలు తెలియవు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పదమూడు మంది సజీవదహనం అయ్యారు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు రోదనల మధ్య చెబుతున్నారు.
జగిత్యాల లో ఐదు గంటలకు బయలుదేరి...
నిన్న సాయంత్రంఐదు గంటలకు జగిత్యాలలో బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వింజమూరుకు వెళుతుంది. అయితే ఇదే మయంలో కంకర టిప్పర్ మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. తెల్లారక ముందే బతుకులు తెల్లారిపోయాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విషమంగా ఉన్న వారిని గుంటూరు, ఒంగోలుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ప్రయాణికుల జాబితాను కూడా హరికృష్ణ ట్రావెల్స్ సంస్థ విడుదల చేసింది. నాన్ ఏసీ బస్సు అయినా ప్రమాదం తీవ్రతకు మంటలు అంటుకున్నాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మరణించినట్లు చెబుతున్నారు. టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన వారిలో ఉన్నాడా? లేక పరారయ్యాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి కొన్ని వివరాలను సేకరిస్తున్నారు. మార్కాపురంజిల్లాలో పోలీసుల కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటే 6304285613, 9985733999,7989537285.9703578434లను సంప్రదించాలని అధకిారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, సీఎస్ పురం, పామూరు ప్రాంతాలకు చెందిన వాు కావడంతో బాధితుల బంధువులు మార్కాపురానికి చేరుకుంటున్నారు.