Weather Report : రానున్న మూడు నెలలు ముప్పే.. ఎండలు ఏ స్థాయిలో ఉంటాయంటే?
రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చిరుజల్లులు పడతాయని, కొన్ని చోట్ల మోస్తరు వానలుపడతాయని పేర్కొంది. అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు కూడా పిడుగులు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల బలంగా వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలుజారీ చేసింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వానలు పడినప్పటికీ ఏప్రిల్,మే, జూన్ నెలలో వాతావరణం మాత్రం హీటెక్కనుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్టోగ్రతలు, రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి.
సాధారణంకంటే ఎక్కువ తీవ్రతతో...
తెలంగాణలోనూ రానున్న కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నేడు, రేపు చిరుజల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు నెలల్లో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యే అవకాశముందని, వీటిని హీట్ వేవ్ అంటారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు తెలియజేశారు. పళ్ల రసాలు తాగుతూ ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలని వేసవిలో కూల్ డ్రింకులు కాకుండా కొబ్బరి బొండం,మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు.