Andhra Pradesh : సీనియర్లు, మంత్రులు సీట్లు చేజారిపోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 175 స్థానాల నుంచి 263 స్థానాల వరకూ పెరగనున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళ రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నాయి. మహిళలకు ఈసారి 33 శాతం చట్ట సభల్లో అవకాశం కల్పించాలని పార్లమెంటులో చట్టం చేయబోతున్నారు. అదే జరిగితే అనేక నియోజకవర్గాలు గల్లంతవుతాయి. తమకు ఇన్నాళ్లు పట్టున్న ప్రాంతాలుగా ఉన్న నియోజకవర్గాలు రిజర్వేషన్ల జోరులో కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బిల్లుకు ఆమోదం లభిస్తే...
పార్లమెంటులో మహిళ బిల్లుకు ఆమోదం లభిస్తే ఏపీలో మహిళలకు ఎనభైకి పైగానే అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కనున్నాయి. ఇందులో ప్రస్తుతం కీలక మంత్రుల స్థానాలు సైతం మహిళలకే వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. 87 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కూడా మారే ఛాన్స్ ఉంది. జనాభా లెక్కల ప్రతిపాదికన రిజర్వేషన్ ఖరారు చేస్తారు. ప్రస్తుతం మహిళలు ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే అందులో అందులో భీమిలి అసెంబ్లీ ఎక్కువ మహిళలతో తొలి స్థానంలో ఉంది. అలాగే పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎక్కువ మంది మహిళలున్నారు.
మహిళలు ఎక్కువగా ఉన్న...
ఇక పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్ఛాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ), రాజమహేంద్రవరం సిటీ, ప్రత్తిపాడు (ఎస్సీ), రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలు జనాభా లెక్కల మేరకు మహిళలు ఎక్కువ వున్నారు. అయితే ఇది అధికారిక లెక్కలు కాకపోయినప్పటికీ జనాభా లెక్కలను చూస్తే మాత్రం మహిళలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో ఉన్న నేతలు సీట్లు గల్లంతవుతాయని చెప్పకతప్పదు.