ఒక కొబ్బరికాయ.. ఒక శాలువా.. ఇదీ జైట్లీ ప్రోగ్రాం

Update: 2016-10-27 15:08 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు శుక్రవారం నాడు రాబోతున్నారు. ఒక ప్రభుత్వ ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. ఏపీ సర్కారు ఆర్భాటంగా ప్లాన్ చేస్తున్న అమరావతి కోర్ కేపిటల్ భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది మోదీ ద్వారా చేయించిన శంకుస్థాపన స్థాయిలో అత్యంత ఆర్భాటంగా నిర్వహించడానికి చంద్రబాబునాయుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన విడతలు విడతలుగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. మంత్రులు స్వయంగా సభాస్థలిలోనే ఉండే ఏర్పాట్లను గమనిస్తున్నారు.

కేంద్రంలో మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో కీలకం అని గుర్తించిన చంద్రబాబు.. నిదులు విడుదల కావాలటే.. ఆయన కరుణ అవసరం అని గుర్తెరిగి.. ఆయనను ఆహ్వానించినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎంతగా ఇంప్రెస్ చేసినా సరే.. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీకి మించి ఒక్క రూపాయి కూడా విదిల్చడు అనేది గ్యారంటీ. కాకపోతే.. ఆ ప్రకటించిన డబ్బులైనా.. విడతలుగా జాప్యం లేకుండా ఇచ్చి ఆదుకుంటే చాలునని పలువురు భావిస్తున్నారు.

అయితే అమరావతిలో కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్ జైట్లీకి శాలువా కప్పి ఘన సన్మానం చేయడానికి రాష్ట్ర భాజపా సన్నాహాలు చేసుకుంటోంది. శుక్రవారం విజయవాడలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి అతి గొప్ప ప్యాకేజీ ఇచ్చినందుకు భాజపా తరఫున థాంక్స్ చెబుతారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.

Similar News