ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పల్లిపాడు వద్ద జరిగన కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న పెళ్లి జరిగింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వరంగల్ జిల్లా వర్థన్న పేట కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రామకృష్ణకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిన్న పెళ్లి జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణతో పాటు నలుగురు మృతి చెందారు. వధువు దుర్గకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంతో రెండుకుటుంబాల్లో విషాదం అలుముకుంది.