సిఐడి డిఎస్పీ హరనాథ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, బెంగుళూరులో 9 ప్రాంతాల్లో హరనాథ్ రెడ్డి ఇళ్లల్లో , బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ...నంద్యాల డిఎస్పీ గా పనిచేసిన హరినాథ్ రెడ్డి కర్నూల్ లో రెండు భవంతులు, 2 ఫ్లాట్లు, తుగ్గలి లో 10 ఎకరాల భూమి, కడప లో ఒక భవంతి ఉన్నట్టు గుర్తించారు..ఇప్పటి వరకు 15 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హరినాథ్ రెడ్డి చాలా పెద్ద చేప. ఆయన ఆస్తులు దాదాపు వంద కోట్లు తేలుతుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.ఆయన మెయింటెనెన్స్ ఓ స్టేట్ డీజి కి కూడా వుండదని, సీఐడి లో మోస్ట్ కరెప్టెడ్ ఆఫీసర్ అని చెబుతున్నారు. నంద్యాల లో డీఎస్పీగా పనిచేసి అక్రమంగా ఆస్తులు సంపాదించారని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వై.హరినాధ్ రెడ్డి అక్రమ ఆస్తుల ఆరోపణలపై కడప, కర్నూలు, అనంతపురం, బెంగుళూరు తదితర ప్రాంతాలతో పాటు...బంధువుల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగతున్నాయి.