Israel- Hezbollah : చర్చలపై దాడుల ప్రభావం.. హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కుదరని సయోధ్య

హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి

Update: 2026-04-11 02:10 GMT

A Hezbollah supporter waves a flag with the portrait of the late Hezbollah leader Sayyed Hassan Nasrallah during a protest against the Lebanese Prime Minister Nawaf Salam, in front the government palace in Beirut, Lebanon, Friday

హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి. ప్రారంభం కానున్న ప్రత్యక్ష చర్చల ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే మంగళవారం వాషింగ్టన్, డీసీ లో చర్చలు మొదలవుతాయని జోసెఫ్ ఔన్ కార్యాలయం ప్రకటన చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా రాయబారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ ప్రకటన విడుదలైంది. ఈ చర్చలు కాల్పుల విరమణ లేదా తాత్కాలిక విరమణ నేపథ్యంలో జరగాలని బీరూట్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అయితే అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ ఈ చర్చలను “అధికారిక శాంతి చర్చలు”గా పేర్కొన్నారు. సీజ్ఫైర్ అంశం చర్చల పట్టికలో లేదని తెలిపారు. ఇది అవన్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది. “హెజ్‌బొల్లా అనే ఉగ్ర సంస్థతో సీజ్ఫైర్ చర్చలకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఆ సంస్థ ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తోంది. రెండు దేశాల మధ్య శాంతికి అది ప్రధాన అడ్డంకి” అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

దక్షిణ లెబనాన్‌లో భారీ నష్టం...
దక్షిణ లెబనాన్‌లో శుక్రవారం జరిగిన ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ రాష్ట్ర భద్రతా దళాలకు చెందిన 13 మంది సిబ్బంది మరణించారు. నబతిహ్ లోని ప్రభుత్వ భవనంపై ఈ దాడి జరిగింది. అదే సమయంలో హెజ్‌బొల్లా, సరిహద్దు నుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ పోర్టు నగరం Ashdodలోని నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ లెబనాన్‌లో ప్రవేశించిన ఇజ్రాయెల్ భూసేనలపై మరో 31 దాడులు జరిపినట్లు తెలిపింది.మార్చి 2న హెజ్‌బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించిన తరువాత ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు, భూసేనల దాడులు ప్రారంభించింది.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 1,953 మంది మరణించారు. బుధవారం కేవలం 10 నిమిషాల్లో 100 దాడులు జరిగాయి. మధ్య బీరూట్‌లోని గణనీయమైన నివాస, వాణిజ్య ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. అదే ఈ యుద్ధంలో అత్యంత రక్తపాతం జరిగిన రోజు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఇంకా శోధిస్తున్నారు.
ఆస్పత్రిపై భయం...
బీరూట్ దక్షిణ అంచున ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి అయిన రఫిక్ హరిరి యూనివర్సిటీ హాస్పిటల్ పై కూడా ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన ఉంది. పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. ఆస్పత్రి ఉన్న ప్రాంతంపై ముందస్తు హెచ్చరికలతో, లేకుండా కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఆస్పత్రిని లక్ష్యంగా చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఆస్పత్రిపై దాడి జరగదని హామీలు అందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు. సిబ్బంది భయాందోళనలో ఉన్నప్పటికీ ఆస్పత్రి ఖాళీ చేయలేదు. “ఆస్పత్రి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతం ప్రమాదకరమని భావించారు. అయినా మాకు మానవతా బాధ్యత ఉంది” అని అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ మహ్మద్ చెయిటో పేర్కొన్నారు.
చర్చలపై హెజ్‌బొల్లా అనుచరుల వ్యతిరేకత...
చర్చల నిర్ణయంపైబెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలపై లెబనాన్ అధికారులు ఇంకా స్పందించలేదు. హెజ్‌బొల్లా నిరాయుధీకరణ, రెండు దేశాల మధ్య “శాంతియుత సంబంధాలు” అంశాలపై చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. లెబనాన్ ప్రభుత్వం తరఫున ఒక అధికారి మాట్లాడుతూ, కాల్పులు ఆగడం చర్చలకు కీలక షరతు అని తెలిపారు. ఇప్పటివరకు చర్చల ప్రతినిధిని నియమించలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధానికి సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్, తరువాత అమెరికా దీనిని ఖండించాయి.హెజ్‌బొల్లా నాయకుడు నైమ్ కస్సేం, లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు “ఉచిత రాయితీలు ఇవ్వవద్దు” అని పిలుపునిచ్చారు.బీరూట్ కేంద్రంలో ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట హెజ్‌బొల్లా అనుచరులు నిరసన తెలిపారు. “ఈ నేలపై మా రక్తం కారింది. మా ప్రభుత్వం మాపై కుట్ర చేస్తోంది. మమ్మల్ని నిరాయుధీకరించాలనుకుంటోంది” అని నిరసనకారుడు హసన్ షుఐబ్ అన్నారు.



Tags:    

Similar News