Vaibhav Sooryavanshi : బుడ్డోడా... మజాకానా...చితక్కొట్టేడేవాడొచ్చాడు.. భారత్ కు "వైభవ"మే
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనకు చూసే వారికి కూడా టీం ఇండియాకు చితక్కొట్టేటోడు దొరికాడనిపించింది
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనకు చూసే వారికి కూడా టీం ఇండియాకు చితక్కొట్టేటోడు దొరికాడనిపించింది. కేవలం పదిహేను బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం అంటే ఎవరికీ సాధ్యం కాదని ఈ బుడ్డోడు నిరూపించాడు. ఏం గుండెరా నీది అన్న హార్థిక పాండ్యా అన్న మాటలు అక్షర సత్యాలు. బౌలర్ ఎవడనేది కాదన్నయ్యా.. బంతిపైనే తన గురి అన్నట్లు వైభవ్ వంశీ ఆటను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నిజంగా త్వరలోనే వైభవ్ సూర్యవంశీ టీం ఇండియాలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఆడుతున్న వైభవ్ ను చూసి ప్రత్యర్థులు కూడా నోరెళ్లపెడుతున్నారు.
ప్రత్యర్థులకు చెమటలే...
రాజస్థాన్ రాయల్స్ లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గా దిగుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్ లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ ను కూడా ఏ మాత్రం భయపడకుండా ఆడటంతో ఇతని పేరు క్రికెట్ రంగంలోనే మారు మోగిపోతుంది. తాజాగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 78 పరుగులు చేసి ఔరా అని అనిపించుకున్నాడు. తర్వాత వైభవ్ మాట్లాడుతూ “నేను బౌలర్‌ను కాదు… బంతినే ఆడుతాను” అని చెప్పిన 15 ఏళ్ల సూర్యవంశి, కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ దిశనే మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ 201 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది.
ఇరవై ఆరు బంతుల్లోనే...
హేజిల్‌వుడ్ వేసిన వరుస నాలుగు బంతుల్లో మూడు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టిన సూర్యవంశి తన ఆటతీరును సయితం ఇలా చెప్పాడు. “ప్రాక్టీస్‌లో ఎలా ఆడుతానో అలాగే ఆడుతాను. నా సహజ ఆటతీరుపైనే నమ్మకం. బౌలర్ ఎవరన్నది మనసులో ఉంటుంది. కానీ బంతినే ఆడాలి.” ఒక్కసారిగా వచ్చిన స్టార్‌డమ్ తనపై ప్రభావం చూపలేదని కూడా చెప్పాడు. తన తండ్రి సంజీవ్, జట్టు సహాయకుడు రోమీ భిందర్ ఎప్పుడూ సరైన సూచనలు ఇస్తూ ఉంటారని తెలిపాడు. “ఇది చాలా పెద్ద ప్రయాణం. ఆటపైనే దృష్టి పెట్టాలని వారు చెబుతుంటారు” అన్నాడు. అయితే 78 పరుగుల వద్ద ఔట్ కావడం తనకు బాధ కలిగించిందని చెప్పాడు. “ఇంకా క్రీజ్‌లో ఉంటే మరో 20 పరుగులు జట్టుకు అందించేవాడిని” అని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. చిన్నోడు కాబట్టి పొగడ్తలు ఎక్కువగా చేయకపోవడమే మంచిది. కానీ భారత్ కు భవిష్యత్ క్రికెట్ తురుపు ముక్క దొరికిందనే చెప్పాలి.
.