Flash news: పంజాబీ రోటీ.. హైదరాబాద్ బిర్యానీ గొంతులో పడితే ఎంత మజా ఉంటుందో అలా ఉంది గురూ...!
వీకెండ్ మ్యాచ్ అదిరిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది
వీకెండ్ మ్యాచ్ అదిరిపోయింది. చివరి వరకూ విజయం ఊరించింది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గెలుపు నీదా? నాదా? అన్నట్లు సాగింది. సన్ రైజర్స్ తరుపున అభిషేక్ శర్మ చెలరేగి ఆడితే.. శ్రేయస్ అయ్యర్ కూడా పంజాబ్ కింగ్స్ తరుపున మామూలుగా ఆడలేదు. కావ్యపాప...ప్రీతి జింటా...ఎవరు అందంగా ఉంటారంటే.. ఏమని చెప్పగలం.. అలాగే.. ఈ మ్యాచ్ కూడా అలానే అలరించింది. కానీ చివరకు 219 పరుగులను అలవోకగా పంజాబ్ కింగ్స్ గెలిచింది.
ఆరు ఓవర్లకు 102.. 20 ఓవర్లకు 219 పరుగులు...
ఆరు ఓవర్లకు 102.. 20 ఓవర్లకు 219 పరుగులు.. అంటే తొలి ఆరు ఓవర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మలు విధ్వంసం సృష్టించారు.ప్రతి బంతిని సిక్సర్, బౌండరీకి బాదుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వందల పరుగులు దాటి రికార్డు క్రియేట్ చేస్తుందన్న భావన కూడా కలిగింది. కానీ వారిద్దరూ ఏడో ఓవర్లో అవుటయిన తర్వాత పరుగుల రాక మందగించింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. పంజాబ్ రోటీ.. హైదరాబాద్ బిర్యానీ తింటుంటే ఎంత మజా ఉంటుందో అలా ఉంది గురూ...!
తొలుత బ్యాటింగ్ చేసిన...
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ శర్మర్మ దూకుడుగా ఆడాడు. కేవలం 28 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అద్భుత స్టయిక్‌రేట్‌తో పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం చాటాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్యం నిర్మించాడు. హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఈ జోడీని శశాంక్ సింగ్ ఒక్కసారిగా విడదీశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌లో అనూహ్య మలుపు తిప్పాడు.మొదటి వికెట్లు త్వరగా పడినా ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు తగ్గలేదు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 27 పరుగులు చేసి వేగం కొనసాగించాడు. అతడిని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. మధ్య ఓవర్లలో హైన్రిచ్ క్లాసెన్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు, శశాంక్ సింగ్ రెండు రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో పంజాబ్ కింగ్స్...
220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ కూడా ఒక వికెట్ కోల్పోయినప్పటికీ అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బలమైన బౌలింగ్ దళం ఎదురు నిలుస్తోంది. ఓపెనర్లుగా దిగిన ప్రియాంశ్ ఆర్య, కూపర్ కెనల్లీ దూకుడగా ఆడారు. ప్రియాంశ్ ఆర్య 57 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రభమన్ సింగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుటయ్యాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 118 పరుగులు చేసి పోటీలో నిలిచింది. కూపర్ 11 పరుగులకే అవుటయ్యాడు. తర్వాత వదేరా, శ్రేయస్ అయ్యర్ లు కలసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి .. 68 పరుగులు చేసి జట్టును గెలపించాడు. వధేరా మద్దతుగా నిలిచాడు. అయితే వధేరా అవుట్ కావడంతో శశాంక్ క్రీజులోకి వచ్చాడు. చివరకు మ్యాచ్ రెండు ఓవర్లకు నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా గెలిచి కింగ్స్ గా నిలిచింది.