Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఇంత తక్కువా.. రీజన్ ఏంటి?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది

Update: 2026-04-11 03:58 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత తిరుమలేశుడిని దర్శించుకునేందుకు రావడానికి ఎక్కువ మంది రానున్నారు. దీంతో పాటు శుభకార్యాల సీజన్ కూడా జరుగుతుండటంతో తమ ఇంట పెళ్లిళ్లు, శుభకార్యాలు ముగించుకున్న తర్వాత కాని తిరుమలకు రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

ఆధ్యాత్మికతతో పాటు...
తిరుమలకు ఆధ్యాత్మికత కోసం ఎక్కువ మంది భక్తులు వస్తారు. కలియుగ వైకుంఠంలో రెండు రోజుల పాటు ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా మంది భావిస్తారు. ఇటు ఆధ్మాత్మికతతో పాటు అటు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి పలకరిస్తాయని, అందుకే యువత కూడా ఎక్కువగా తిరుమల శ్రీనివాసుడిని గత కొంతకాలంగా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,534 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,560 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.22 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News