అసెంబ్లీలో... రేవంత్ ఇలా...!

Update: 2017-10-26 07:11 GMT

రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ఆలింగనం చేసుకున్నారు. అయితే బీఏసీ సమావేశానికి మాత్రం రేవంత్ హాజరుకాలేదు. రేవంత్ అసెంబ్లీ లోని టీడీఎల్పీ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎదురయ్యారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంపత్ లు రేవంత్ ను ఆలింగనం చేసుకున్నారు. సీఎల్పీ సమావేశానికి ముగించుకుని వస్తున్న కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఎదురుపడ్డారు. టీడీఎల్పీ సమావేశంలోకి వెళ్లిన రేవంత్ తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోకుండా పక్కన కూర్చోవడం విశేషం. రేవంత్ వెంట వేం నరేందర్ రెడ్డి ఉండటం విశేషం.

Similar News