మంత్రి అఖిలప్రియను వ్యంగ్యంతో మాట్లాడరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వచ్చినట్లుంది. ఈరోజు అసెంబ్లీలో తెలుగు భాష అమలుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత మంత్రి అఖిలప్రియ మాట్లాడారు. అయితే ఆమె ప్రసంగంలో అక్కడక్కడా ఆంగ్ల పదాలు దొర్లడంతో ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ తప్పుపట్టారు. ఆ శాఖ మంత్రిగా ఉండి తెలుగులో మాట్లాడటం నేర్చుకోండమ్మా అని ఎద్దేవా చేశారు. అఖిలప్రియ ప్రసంగంలో అక్కడకక్కడా ఆంగ్ల పదాలు దొర్లాయన్నది ఆయన అబ్జెక్షన్. అయితే తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలప్రియను ఎద్దేవా చేసిన గౌతు శ్యాంసుందర్ శివాజీకి చురకలంటారు. గౌతు శ్యాంసుందర్ శివాజీ తెలుగులో బాగా మాట్లాడాని, అయితే ఆయన కూతురు అమెరికాలో ఉంటారని, అక్కడకు వెళితే ఆయన కూడా ఇంగ్లీషు మాట్లాడక తప్పదని చురకలంటించారు. అలాగే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తన కుమార్తెను బెంగుళూరులో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారని చెప్పి సభలో ముఖ్యమంత్రి నవ్వులు పూయించారు.