టీటీడీ ఆస్తుల వేలం వేయడానికి కాదు.. రోడ్ మ్యాప్ కోసం మాత్రమే….?

టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాము భూములను అమ్మాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయించలేదని చెప్పారు. వేలానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను [more]

Update: 2020-05-25 12:36 GMT

టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాము భూములను అమ్మాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయించలేదని చెప్పారు. వేలానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను రూపొందించాలని మాత్రమే తాము తీర్మానం చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భూముల వేలం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం హాయంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. ఆ బోర్టులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఆస్తుల వేలం వేయాలని నిర్ణయించారన్నారు. 1974 నుంచే టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నారన్నారు. దాదాపు 142 ఆస్తులను విక్రయించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ టీటీడీ భూములను వేలం వేశారన్నారు. తాము కొత్తగా ఏమీ చేయడం లేదన్నారు. దీనిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని వైైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమపై ఇన్నాళ్లూ వ్యక్తిగతంగా విమర్శలు చేసినా సహించామని, దేవుడిపైనే నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము దేవుడి సేవకే వచ్చామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News