వైసీపీ సాయంత్రం ఐదు గంటలకు చెబుతుందట

రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత వేగం పెంచింది. రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఈరోజు వైసీపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ [more]

Update: 2020-01-02 06:56 GMT

రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత వేగం పెంచింది. రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఈరోజు వైసీపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అమరావతి రాజధానిలో ఎవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారు? ఎంత మంది బినామీలతో భూముుల కొనుగోలు చేశారు? అసైన్డ్ భూములు టీడీపీ నేతలు ఎవరు కొనుగోలు చేశారు? అన్న దానిపై వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని అక్రమాలపై ఆధారాలతో కూడిన వీడియోలను విడుదల చేస్తామని వైసీపీ చెబుతోంది.

Tags:    

Similar News