అధ్యక్ష్యా… ఈ పెద్దమనిషి చంద్రబాబు…?
చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేసేవారని, అబద్ధాలు చెప్పేవారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి దారుణమైన ఎస్సీ, ఎస్టీ ద్రోహి ప్రపంచంలోనే ఎవరూ [more]
చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేసేవారని, అబద్ధాలు చెప్పేవారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి దారుణమైన ఎస్సీ, ఎస్టీ ద్రోహి ప్రపంచంలోనే ఎవరూ [more]
చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేసేవారని, అబద్ధాలు చెప్పేవారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి దారుణమైన ఎస్సీ, ఎస్టీ ద్రోహి ప్రపంచంలోనే ఎవరూ ఉండరని జగన్ అన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంటే ఇక కిందిస్థాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. దళితులకు ద్రోహ చేసింది చంద్రాబేనని అన్నారు. 1992లో నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటయినా, చంద్రబాబు 2003 వరకూ దానిని రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదని తెలిపారు. అసైన్డ్ భూములను కూడా రాజధాని భూముల కేటాయింపులో దళితుల పట్ల వివక్ష చూపారన్నారు. ఓట్ల కోసం కులాలను కూడా చీలుస్తారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాలు 36 ఉంటే ఒక్క స్థానంలోనే టీడీపీ గెలిచిందన్నారు. రాజకీయాల కోసమే పిల్లనిచ్చిన మామ ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరారన్నారు. తమ ప్రభుత్వంలో మంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారని చెప్పారు.