ఏపీలో భూముల వేలం.. పాడుకున్న వారికి?

కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలువైన భూములను విక్రయించాలని నిర్ణయించింది. [more]

Update: 2020-05-14 02:14 GMT

కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలువైన భూములను విక్రయించాలని నిర్ణయించింది. తొలి విడతగా గుంటూరు, విశాఖ నగరాల్లో ఉన్న భూములను విక్రయించేందుకు సిద్ధమయింది. ఈ మేరకు నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఈ భూముల వేలం ప్రక్రియకు అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈవేలం జరగనుంది. మొత్తం 18 ఎకరాలను తొలిదశలో ప్రభుత్వం విక్రయించనుంది. దీని విలువను 208 కోట్లగా నిర్ణయించారు. నాడు-నేడు అమలు కోసం అవసరమైన నిధుల సేకరణకు భూముల విక్రయానికి ఏపీ ప్రభుత్వం సిద్దమయింది.

Tags:    

Similar News