పాదయాత్రలో నన్ను కలచివేసిన సంఘటన అది

వైఎస్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేదని, భరోసా ఉండేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు [more]

Update: 2020-04-28 08:42 GMT

వైఎస్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేదని, భరోసా ఉండేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు. పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ గత ప్రభుత్వాలు చెల్లించలేదన్నారు. షరతులు పెట్టి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేశారన్నారు. తన పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో గోపాల్ అనే వ్యక్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో తన కుమారుడు చనిపోయాడని తెలిపారన్నారు. ఈ సంఘటన తన మనసును కలచివేసిందన్నారు జగన్. జగనన్న విద్యాదీవెనను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సందర్బంగా మాట్లాడారు. పూర్తి స్థాయిలో పీజు రీఎంబర్స్ మెంట్ అమలుచేస్తామన్నారు. విద్యార్థులకు వసతి, భోజనం కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు కళశాల యాజమాన్యం నుంచి వెనక్కు తీసుకోవచ్చాన్నారు. ఏదైనా కళశాల ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని జగన్ అన్నారు. పాత బకాయీలన్నీ పూర్తిగా తీర్చేశామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News