విశాఖ డెవలెప్ మెంట్ పై జగన్ ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ లో చేయాల్సిన అభివృద్ధి పనులపై జగన్ సమీక్షించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని పైపులైన్ల [more]
విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ లో చేయాల్సిన అభివృద్ధి పనులపై జగన్ సమీక్షించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని పైపులైన్ల [more]
విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ లో చేయాల్సిన అభివృద్ధి పనులపై జగన్ సమీక్షించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని పైపులైన్ల ద్వారా తరలించే ప్రతిపాదనలపై జగన్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే 30 ఏళ్ల నాటికి నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలను రూపొందించాలని జగన్ ఆదేశించారు. అలాగే విశాఖ నుంచి భీమిలి వరకూ రోడ్ల విస్తరణ పనులపై కూడా జగన్ సమీక్షించారు. భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై జగన్ అధికారులతో సమీక్షించారు. బీచ్ క్యారిడార్ పనులను వేగంగా చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు.