Ys Vijayamma : ఆస్తుల వివాదం.. అధికారానికి మళ్లీ దూరం చేయనుందా?

వైఎస్ విజయమ్మ తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి

Update: 2026-03-21 08:59 GMT

వైఎస్ విజయమ్మ తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి. ఆస్తుల పంచాయతీని జనంలోకి తీసుకు రావడమే కాకుండా జగన్ మరింత పలుచనగా మారిపోతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వైఎస్ విజయమ్మ తొలి నుంచి షర్మిలకు మద్దతుగానే నిలుస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఉన్నఆస్తుల పంపకం జరిగిపోయిందని, అయితే తర్వాత జగన్ తాను సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటాలు అడిగితే ఎలా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బహిరంగ లేఖ రాయడంతో...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని వైఎస్ విజయమ్మ మరో లేఖ రాసిన నేపథ్యంలో ఆస్తుల వివాదం మరొకసారి తెరలేచింది. ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యమని, ఇది ఆయన ఆదేశం కూడా నని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని కూడా వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. . జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టేవే.
ఎవరైనా ఇచ్చారా?
అయితే వైసీపీ నేతలు మాత్రం తాను సంపాదించుకున్నఆస్తులు చెల్లెళ్లకు ఎవరైనా ఇచ్చారా? అని వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆస్తులను చెల్లెలు విమలమ్మకు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అలాగే బ్రదర్ అనిల్ కూడా తన సోదరికి ఆస్తులు రాసిచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో ఇలా బయటకు వచ్చి జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం సరికాదని విజయమ్మకు సరికాదని అంటున్నారు. అంతకు ముందు కూడా ఎన్నికల సమయంలో కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని విజయమ్మ అమెరికా నుంచి వీడియో విడుదల చేశారని, ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థులు లాభపడేలా వ్యవరహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద తల్లీ కొడుకుల ఆస్తుల వివాదం రాజకీయంగా జగన్ కు నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.













Tags:    

Similar News