జగన్ కేసులు అన్నీ వాయిదా

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్ షీట్ లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు, [more]

Update: 2021-03-20 01:11 GMT

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్ షీట్ లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2)నూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో సీబీఐ కోర్టుకు బీపీ ఆచార్య హాజరయ్యారు. కొత్త సెక్షన్లపై హైకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని ఆచార్య కోర్టును కోరారు. దీంతో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈనెల 26కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్, ఇందూ టెక్ జోన్ కేసులు కూడా ఈనెల 26కి వాయిదా పడ్డాయి. అరబిందో, హెటిరో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈనెల 26కి వాయిదా పడ్డాయి. రఘురాం సిమెంట్స్ కేసు ఈనెల 22కి, దాల్మియా కేసు ఏప్రిల్ 9వ తేదీకి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

Tags:    

Similar News