అపోహలొద్దు… తప్పుడు మాటలు నమ్మొద్దు

వైఎస్సార్ జలకళ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ పథకం కోసం 2,340 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. చిన్న, సన్న కారు రైతులకు చెందిన భూముల్లో [more]

Update: 2020-09-28 06:48 GMT

వైఎస్సార్ జలకళ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ పథకం కోసం 2,340 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. చిన్న, సన్న కారు రైతులకు చెందిన భూముల్లో బోరులను వేసి, వాటికి మోటార్లను కూడా బిగిస్తామని జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని జగన్ తెలిపారు. ఈ బోర్లను రైతుల భూముల్లో ఉచితంగా వేయిస్తున్నామని జగన్ చెప్పారు. తాను పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీని ఈ పథకం ద్వారా నెరవేరుస్తున్నానని జగన్ తెలిపారు. అలాగే రైతులకు నిరంతరాయంగా విద్యుత్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు. మరో 30 ఏళ్ల పాటు రైతులకు నాణ్యతతో కూడిన విద్యుత్ ను అందించడంలో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పారు. పూర్తిగా రైతులకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని చెప్పారు. దీనిపై ఎటువంటి అపోహలు వద్దని జగన్ రైతులను కోరారు. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు. విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని జగన్ ఈ సందర్భంగా రైతులను కోరారు. రైతు భరోసా కూడా ఎప్పటిలాగే అందిస్తామని చెప్పారు. నీటితీరువాను ప్రభుత్వం 25 శాతం పెంచబోతుందంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని జగన్ కోరారు.

Tags:    

Similar News