జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-07-14 13:58 GMT

తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాలలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ట్యాక్స్ వసూలు చేసి లోకేష్ కు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ట్యాక్స్ పేరుతో ఎమ్మెల్యేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. ప్రతి ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయలు వసూలు చేసి కలెక్టర్ ద్వారా లోకేష్ కు అందజేస్తున్నారని తెలిపారు.

Similar News