భారీ మెజారిటీలు ఉండవ్!

ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు 2009 , 2014లో జరిగిన ఎన్నికలకు మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.మొదటిసారి ప్రత్యర్థి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాగా 2014 లో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కావడం విశేషం

Update: 2024-01-07 03:29 GMT

Will this election repeat the result of 2014 or 2019, in whose Chandrababu lost and won

ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు 2009 , 2014లో జరిగిన ఎన్నికలకు మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.మొదటిసారి ప్రత్యర్థి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాగా 2014 లో ఆయన తనయుడు  జగన్మోహన్ రెడ్డి కావడం విశేషం. 2009లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత రాజశేఖర్ రెడ్డి మీద వ్యతిరేకత జనాలలో బాగా పెరిగింది. ఆయన సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయగలిగినా, నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఆరోపణలు, బలమైన ప్రతిపక్ష మీడియా ఆయన గెలుపును కష్టం చేశాయి రాజశేఖర్ రెడ్డి ఆదిపత్యాన్ని భరించలేని సొంత పార్టీ నాయకులు కూడా ఆయనను ఒంటరి చేశారు. ఒక దశలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఓడిపోతే బాగున్ను  అని పార్టీలో చాలా మంది నాయకులు ఆశించారు. చంద్రబాబు నాయుడు అప్పటి టిఆర్ఎస్, కమ్యూనిస్టు లతో ఓ ఫ్రంట్ ఏర్పాటుచేసి ఎన్నికలలో పోరాడారు. కేవలం పది సీట్ల మెజారిటీతో రాజశేఖర్ రెడ్డి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

2014లో జరిగిన ఎన్నికలలో సైతం చంద్రబాబు నాయుడు బిజెపి, జన సేనలతో పొట్టు పెట్టుకొని అధికారంలోకి రాగలిగారు. బాబు అధికారంలోకి వచ్చిన 1999 2014 రెండు సందర్భాలలోనూ చంద్రబాబు బిజెపితో పొత్తులో ఉండటం గమనార్హం. విడిగా పోటీ చేసిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ గట్టిగా దెబ్బతింది. అందుకే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో బిజెపి నో అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోడానికి కూడా  ఆయన సిద్ధంగా ఉన్నారు జగన్ పరిస్థితి కూడా పైకి చెప్తున్నంత బాగాలేదు. 175 సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదని స్థానిక నాయకులు అంటున్నారు. 2009 రిపీట్ అయితే జగన్ స్వల్ప మెజార్టీతో గట్టి ఎక్కుతారు. 2014 రిపీట్ అయినా చంద్రబాబుకి కూడా వచ్చేది అంతంత మెజారిటీ మాత్రమే. 2019 తరహా భారీ విజయాలని మనం ఆశించక్కర్లేదు.

Tags:    

Similar News