యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. మహిళలు, యువతకు అవకాశం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో పార్టీలు తమకు తోచిన విధంగా ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల జాబితాను

Update: 2022-01-13 11:47 GMT

ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో పార్టీలు తమకు తోచిన విధంగా ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందే విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారు.

ఆన్ లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రియాంక గాంధీ వాద్రా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఉన్నావో శాసన సభ నియోజకవర్గం నుంచి ఓ అత్యాచార బాధితురాలి తల్లిని పోటీలో నిలుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పూనం పాండేను షాజహాన్ పూర్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు తెలిపారు. న్యాయం కోసం పోరాడినవారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు. అటువంటివారు ముందుకు వచ్చి, రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. పోరాడే శక్తిని కాంగ్రెస్ సమకూర్చుతుందన్నారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మీడియా అడిగినపుడు ప్రియాంక గాంధీ వాద్రా సమాధానం చెప్పలేదు. ఈ ఎన్నికల్లో నెగెటివ్ ప్రచారం చేయబోమని, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు కోసం పాజిటివ్ ప్రచారం చేస్తామని అన్నారు. మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ చరిత్రాత్మక చర్య ద్వారా రాష్ట్రంలో నూతన రాజకీయాలను తీసుకువస్తున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిక్టేటర్ లాగా వ్యవహారిస్తోందని.. ఎన్నికల తర్వాత అవకాశం ఉంటే బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతుగా నిలుస్తామని ప్రియాంక అన్నారు.


Tags:    

Similar News