బ్రేకింగ్ : అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల… సినిమా థియేటర్లు

అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలలను తెరవడంపై పూర్తి [more]

Update: 2020-09-30 14:47 GMT

అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలలను తెరవడంపై పూర్తి స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలివేసింది. 50 శాతం సీట్లతో సినిమా హాళ్లు తెరుచుకోడానికి అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ పార్కులను కూడా తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కంటోన్మెంట్ జోన్ లలో అక్టోబరు 31వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవాలని, యాభై శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్ కు అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News