ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. బ్యాంకులన్నింటినీ ప్రయివేటు [more]

Update: 2021-03-17 01:18 GMT

మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. బ్యాంకులన్నింటినీ ప్రయివేటు పరం చేయాలన్నది మోదీ ఆలోచన అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మోదీ ఏ వర్గానికి న్యాయం చేయడం లేదన్నారు. మోదీ ప్రధాని అయ్యే నాటికి 46 లక్షల కోట్లు ఉన్న భారత్ అప్పు, ప్రస్తుతం కోటీ 7లక్షలకు చేరుకుందన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ నిర్ణయాలను వ్యతిరేకించల్సిన సమయం వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మోదీకి పాలన చేయడం చేతకాదన్న విషయం స్పష్టమయిందని ఆయన అన్నారు.

Tags:    

Similar News