మరో ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ కొద్దిరోజుల కిందటే రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలపై..

Update: 2022-04-25 12:11 GMT

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. కార్గో సేవలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ సందర్భంగా కార్గో, పార్సిల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ సదుపాయం మే 3 వరకు అందుబాటులో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. 5 కేజీల బరువు వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ కొద్దిరోజుల కిందటే రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. ఒక్కో రిజర్వేషన్ పై రూ.20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. గత నెలలో టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచి మరో భారాన్ని ప్రయాణీకులపై మోపింది. ఇక టికెట్ల ధరలు స్వల్పంగా పెంచిన తెలంగాణ పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు.
టోల్ ప్లాజా ధరలు కూడా టికెట్ పై రూపాయి చొప్పున పెంచారు. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై 2 రూపాయల చొప్పున పెంచారు. కొద్దిరోజుల కిందట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఆర్టీసీ పాలకవర్గం సమావేశం జరిగింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎండి సజ్జనార్‌తో పాటు ఏడుగురు పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించారు.


Tags:    

Similar News