రాజా ది గ్రేట్... ఇండియా క్లీన్ స్వీప్

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ టీ 20ని తలపించింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠ రేపింది. చివరకు ఇండియాదే విజయం అయింది.

Update: 2022-08-22 15:28 GMT

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ టీ 20ని తలపించింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠ రేపింది. చివరకు ఇండియాదే విజయం అయింది. పదమూడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధంచింది. మూడు వన్డే సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జింబాబ్వేపై భారత్ జట్టు విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు భారీ స్కోరు చేసింది. యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ నిరాశపర్చినా శిఖర్ ధావన్ 40పరుగుల చేశారు. ఇక యువ ఆటగాడు శుభమన్ గిల్ 130 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ ఐదు వికెట్లు పడగొట్టి ఇండియాను దెబ్బతీయగలిగాడు. అయినా భారీ లక్ష్యాన్ని జింబాబ్బే ముందు ఇండియా ఉంచింది.

చివర వరకూ పోరాడి...
అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదని అందరూ భావించారు. తొలుత జింబాబ్బే బాటర్లు తడబడ్డారు. ఏడు వికెట్లు కోల్పోయినా మ్యాచ్ చివర వరకూ ఉత్కంఠను రేపింది. రాజా సెంచరీ పూర్తి చేశారు. వికెట్లు పడిపోతున్నా రాజా మాత్రం పట్టు వదలకుండా మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లాడు.  జింబాబ్వే ఆటగాళ్ల పోరాట పటిమను అభినందించకుండా ఉండలేం. చివరి మూడు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సి ఉంది. రెండు ఓవర్లలో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇవాన్ అవుట్ కావడంతో కొంత ఇబ్బంది పడింది. రాజా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. రాజా 94 బాల్స్ కు 115 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఎనిమిది బాల్స్ కు 15 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరిగా క్రీజులోకి దిగిన బ్యాటర్లు విఫలం కావడంతో జింబాబ్వే విజయం అంచుల దాకా వచ్చి పరాజయం పాలయింది. చివరకు ఇండియానే విజయం వరించింది. జింబాబ్వే పోరాడి ఓడినట్లయింది.


Tags:    

Similar News