అసెంబ్లీ ఎదుట టీడీపీ

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ తొలగించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుపై [more]

Update: 2019-07-25 06:02 GMT

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ తొలగించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుపై బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేయడంపై తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. టీడీపిీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ధర్మాలో పాల్గొన్నారు. మరోవైపు శాసనసమండలిలో గోదావరి నీటి వినియోగంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడంతో మండలిలోని టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News