హర్యానాలో కొనసాగుతున్న హింసాకాండ.. 144 సెక్షన్‌ అమలు, ఇంటర్నెట్‌ బంద్‌

హర్యానాలో హింసాకాండ తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీస్తోంది.

Update: 2023-08-07 08:12 GMT

హర్యానాలో హింసాకాండ తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీస్తోంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. పెద్ద ఎత్తున దూరారం రేగుతోంది. అయితే ఈ అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాఇ.

ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా సుమారు 120 వాహనాల్లో మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ హింసను నియంత్రించేందుకు నుహ్ లో 144 సెక్షన్, కర్ఫ్యూ అమలు చేశారు. 70 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుహ్ హింసపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిచారు. సోమవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల వెనుక “కుట్ర” ఉందని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత:

ఆదివారం కూడా హింసాత్మక ప్రాంతంలోని అక్రమ హోటళ్లపై బుల్డోజర్లతో కూల్చివేశారు. జూలై 31న అల్లర్లు ఈ హోటళ్లపై రాళ్లు రువ్వారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 37 భవనాలపై బుల్ డోజర్లతో కూల్చివేశారు.

నూహ్‌లో ఇంటర్నెట్‌ నిషేధం:

అదే సమయంలో ప్రభుత్వం నూహ్‌లో ఇంటర్నెట్ నిషేధాన్ని ఆగస్టు 8 వరకు పొడిగించింది. దీంతో పాటు పాల్వాల్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని కూడా నేటి వరకు పొడిగించారు. అయితే మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 216 మందిని అరెస్టు చేశామని, సుమారు 104 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హర్యానా అల్లర్లలో ఇప్పటి వరకకు ఆరుగురు మరణించారు.

హర్యానా రాష్ట్రంలోని జిల్లా నుహ్ అధికార పరిధిలో వాయిస్ కాల్స్ మినహా ఇంటర్నెట్ సేవలు, బల్క్ SMS, అన్ని డాంగిల్ సేవలు మొదలైన వాటి సస్పెన్షన్ 8 ఆగస్టు 2023 వరకు పొడిగించబడినట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు జిల్లాల్లో ఎస్‌ఎంఎస్ సేవల నిలిపివేతను ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు సమాచారం.

పోలీసుల ఆంక్షలు పొడిగింపు:

జిల్లా నుహ్ అధికార పరిధిలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు విధించిన ఆంక్షలు ఆగస్టు 8 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయి. హర్యానా ప్రభుత్వం గతంలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేసింది. తరువాత ఆగస్టు 5 వరకు పొడిగించింది.

జూలై 31న ముస్లిం మెజారిటీ ప్రాంతం అయిన నుహ్‌లోని నల్హర్ దేవాలయం సమీపంలో విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపులో ఘర్షణలు చెలరేగడంతో ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు నిలిపివేశారు. ఈ హింస గురుగ్రామ్, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపించింది. ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువుతో సహా ఆరుగురు మరణించారు. గురుగ్రామ్‌లో కూడా హింసాత్మకంగా మసీదులను లక్ష్యంగా చేసుకున్న గుంపులు వందకు పైగా వాహనాలు, దుకాణాలు, సంస్థలను తగులబెట్టాయి.

Tags:    

Similar News