గులాబీ నేత సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ టీమ్‌లో 'పట్నం'కు చోటు!

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితా నిన్న సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే..

Update: 2023-08-22 04:06 GMT

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితా నిన్న సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతోంది. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్నారు కేసీఆర్. అయితే మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రాజ్ భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో సమయం ఇస్తే వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉండదనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈటెల స్థానంలో మరొకరిని భర్తీ చేసేందుకు కేసీఆర్‌ ఇద్దరి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అందులో బండ ప్రకాష్, పట్నం మహేందర్‌ ఉన్నారు. ఇందులో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి రేసులో బండ ప్రకాష్ .. రెడ్డి సామాజికవర్గం నుంచి పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇందులో పట్నం మహేందర్‌ రెడ్డికి అవకాశం దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పాండిచ్చేరిలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. వచ్చిన తర్వాత మంత్రి వర్గ మంత్రి వర్గ విస్తరణకు సమయం ఇవ్వనున్నారు. ఒక వేళ గవర్నర్ నిర్ణయం తీసుకుంటే బుధవారం ప్రమాణ స్వీకరారం ఉండనుంది.

Tags:    

Similar News